ఈనాటి ఈనాడు పత్రికలోని ఒక వ్యాసం నుంచి కొన్ని అంశాలు: శృంగారం... మనసుల భేటీ. తనువుల పోటీ! ఆ భేటీలో... ఇరు మనసులు మరింత దగ్గరవుతాయి. మనువుకు అర్థం అంతేగా! ఆ పోటీలో... ఇద్దరూ విజేతలవుతారు. 'ఆనందోబ్రహ్మ' అదేగా! నవతరం దంపతులారా... ఆ ఆనందానుభూతుల్ని దూరం చేసుకోకండి. పరుగుల జీవితంలో శృంగారం నిషిద్ధఫలం కాదు... సిద్ధాన్నం! నిండు జీవితానికి ఓ వరం. అందుకోండి. ఆస్వాదించండి. ఆనందంగా గడపండి. ఆరోగ్యంగా ఉండండి. ఇంట్లో పరిపూర్ణ శృంగారాన్ని అనుభవిస్తున్నవారే ఆఫీసులో చక్కగా పనిచేస్తారు. చిటపటలాడకుండా చిరునవ్వుతో మెలుగుతారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్నీ వారికే. సెక్స్‌కు దూరంగా ఉండేవారిలో ఓరకమైన అశాంతి కనిపిస్తుంది. అది వారిని స్థిమితంగా ఉండనీదు. ప్రశాంతంగా పని చేయనీదు. ఆక్సీటోసిన్ వారిద్దరిమధ్యా ఉన్న అనురాగాన్ని పదిరెట్లు పదిలం చేస్తుంది. 'నాకు నువ్వు... నీకు నేను' అన్న భావన బలపడేది పడకగదిలోనే. 'ఇదో గొప్ప భావవ్యక్తీకరణ' అంటారు కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్టు జాన్ మ్యారో. ప్రణయానికీ వాసన గ్రహించే శక్తికీ సంబంధం ఉంది. శ...