మంచి పట్టే పట్టావ్ మనవడా ...

అల్లసానిపెద్దన కృష్ణదేవరాయని శౌర్యాన్ని వర్ణించి చెప్పిన ఈ పద్యంలో తెనాలిరామకృష్ణుడు ఒక పట్టుపట్టి తాతాచార్యుని ఇబ్బంది పెట్టాడని చెబుతారు. మాధవపెద్దిసత్యం పాడిన ఈ పద్యాన్ని నేను పాడటం దుస్సాహసం-2.




మంచి పట్టే పట్టావ్ మనవడా ... అని పెద్దమనసుతో మెచ్చుకొని, ఏదీ నువ్వొక పద్యంచెప్పు అనగానే అతిశయాలంకారంలో ఆ మనవడు చెప్పిన ఈ పద్యం వినండి. ఈ పద్యంలోని పదాల్ని విడగొట్టి బ్రౌణ్యములో అర్థాలు వెదికి కొంతమేర అర్థంచేసుకొని "ఓహో" అనుకొని సంబరపడ్డాము మాయింట్లో. ఎందుకింత ప్రయాస అంటే ఘంటసాల పాడిన పద్ధతి అంత ఆసక్తికరంగా గొప్పగా వుంది మరి.

మీరూ వినండి ఇక్కడ.

కలనన్ - యుద్ధంలో
తావక - నీయొక్క
ఖడ్గఖండితుడైన
రిపు - శత్రు
క్ష్మా భర్త - భూ పాలకుడు
మార్తండమండల భేదంబొనరించి ఏగునపుడు
తత్ మధ్యంబునన్ - ఆ మార్గ మధ్యంలో
తార కుండల కేయూర కిరీట భూషితుడైన శ్రీమన్నారాయణుని చూచి
లో గలగం బారుచు నేగె - భయపడి వడిగా పారిపోయెను (ఎందుకు అంటే...)
నీవ యను శంకన్ - అది నీవేనేమో అనే భయంతో నయ్యా కృష్ణరాయాధిపా!! (అధిపుడు - రాజు)

ఈ పద్యం యొక్క అర్థాన్ని చెప్పడంలో నేను పొరబాట్లు చేసివుంటే విజ్ఞులు నాకు మొట్టికాయలు వేయవలసిందిగా మనవి.

కామెంట్‌లు

రాధిక చెప్పారు…
ammo chalaa high pich lo vundandi ii padyam.baagaa amdukunnaru miiru.ika ardaalu avi naaku teleevu.vinadam varaku baagumdi

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

లఘు కవితలు - సర్వలఘు కందము

ఉత్పలమాల - గురువు - లఘవు