రామ'నాదం'

స్తుతమతియగు ఆంధ్రకవి ధూర్జటి పలుకులకెందుకీ తులలేనిమాధుర్యం అంటూ అబ్బురపడి ఎటోవెళ్లిపోయిన కృష్ణదేవరాయని తన చమత్కారపు సమాధానంతో ఈలోకానికి తెచ్చిన తెనాలిరామలింగని ఆశువు ఈ పద్యం.

తెనాలిరామకృష్ణ చిత్రంలో రామారావు, నాగేశ్వరరావులిరువురి నటనకూ తన గాత్రంతో ప్రాణంపోసిన మహానుభావుడు ఘంటసాల పాడిన ఈ పద్యాన్ని కనీస సంగీతపరిజ్ఞానం, సాధన, ఒక శ్రుతివాయిద్యం కూడా తోడులేకుండా నాలాంటి వాడు పాడటం దుస్సాహసమే. విన్న ప్రతిమారూ నన్ను రోమాంచితుణ్ణి చేసే ఈ పద్యాన్ని మొన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధైర్యంగా గాఠ్ఠిగా పాడి రికార్డ్‌ చేశాను.




ఘంటసాల గొంతువిని ఏ గొంతువిన్నా తియ్యని పాయసం తిని కాఫీ తాగినట్లు చప్పగా వుంటుంది. మరి నేనెంత. అందుకే ఇది దుస్సాహసం అన్నాను. ఈ పద్యం ఘంటసాల స్వరంలో - ఇక్కడ వినండి.

ఈ 'పాడు'కాస్టింగ్ పరిజ్ఞాన దానకర్ణులు వైజాసత్య రవి, సుధాకర్‌గార్లకు కృతజ్ఞతలు.

కామెంట్‌లు

spandana చెప్పారు…
అద్బుతంగా పాడారు. మీ గొంతు నిశ్చయంగా బాగుంది. మరిన్ని పాడండి వింటాను.
--ప్రసాద్
http://blog.charasala.com
అజ్ఞాత చెప్పారు…
అద్భుతం. నిశ్చయంగా మరిన్ని పాడండి, విని పెడతాం.
రాధిక చెప్పారు…
మీ గాత్రం మధురం గా వుంది.సంగీత జ్ఞానం తెలిసినవారు పాడారేమో అనుకుంటారు ఎవరన్న ముందు మాట చదవకుంటే.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము