పోస్ట్‌లు

సెప్టెంబర్, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

పొద్దుపోని యవ్వారం - 11

ఇంతకూ ఏమంటారు కొత్తపాళీగారు? ఈ వారాంతం తీరిక లేదంట! ఏమంట? శతజయంత్యుత్సవాలంట. ఉత్సవా-లు? ఎన్నేమిటీ? మూడు. ముగ్గురికి. వాళ్లు పుట్టి నూరేండ్లు నిండబోతున్నాయంట. ఎవరయ్యా ఆ త్రిమూర్తులు? కొడవటిగంటి కుటుంబరావు, శ్రీరంగం శ్రీనివాసరావు, త్రిపురనేని గోపీచందు. వీళ్లకా? హహ్హహ్హహ్హ..!! ఎందుకు నవ్వుతావు? నేను పుట్టిన దశాబ్దం మొదట్లోనే మొదటి ఇద్దరికీ నిండిపోయాయన్నారు నూరేండ్లూ. అంతకు రెండు దశాబ్దాలముందే గోపీచందుకు నిండిపోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ నూరేండ్లు నిండబోతున్నాయంటూ పండగలు చేస్తున్నారంటే యేమనుకోవాలి? ???? కొ.కు. 1980లో, శ్రీశ్రీ 1983లో, గోపీ 1962లో మహాప్రస్థానం చేశారు. స్వర్గంలో కొత్తకొత్త కథలూ కవితలూ వినిపించడానికి. అసలు స్వర్గమూ అదీ అంటే హేతువాదులూ వీర నాస్తికులు వీళ్లొప్పుకోరేమో కూడా. మరీ విపరీతం మనిషివి నువ్వు. కొ.కు. 1909లోనూ, శ్రీశ్రీ - గోపీచందు లు 1910లోనూ పుట్టారు తెలుసా? ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్పరచయితలూ మహాకవులూ వీళ్లు. ఐతే ఏమంటావు? మూడు మాటలు. 1. నీకు నుడికారం బాగా తలకెక్కిందని. 2. మహాకవులకు మరణం లేదనీ, వయసుతో నిమిత్తంలేదనీ. 3. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ - వీళ్ల రాతలు చదవవోయ్

కవితల విద్యామంత్రి కపిల్

అలవోకగా కవితలు చెప్పగల విద్యామంత్రి మన కేంద్రప్రభుత్వంలో కొలువుదీరి వున్నాడంటే దేశానికిది శుభసూచికగా కనిపిస్తోంది. అదిన్నీ, పొంగిన ఆ కవితలను ఆయన తన జేబువాణి/చరం/సెల్‌ఫోను/మొబైల్‌లో సంక్షిప్తసమాచార(ఎస్సెమ్మెస్)పరిభాషలో రాసుకుంటారట. మంత్రి నోట మంచి భవితకు బాటలు పరచబోతున్నాయనిపించే మాటలు వినవస్తున్నాయి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల గోల ఇక ఉండబోదనే మాట వింటున్నానుగానీ, మన విద్యావిధానాన్ని సవరించబోవడంలో మంత్రిగారి దార్శనికత మరియు శ్రద్ధ ఏపాటివో ఈ వీడియో చూశాక కొంత అవగతమయింది. అన్నింటికంటే నన్ను సంతోషపెట్టిన విషయం - పని చేసే మంత్రి ఒకరుండటం. పనిని ఇష్టంగా చేసే మనిషి కావడం. అందులోనూ కవితలు చెప్పగలగడం. మంత్రిగారి పనులకు మంచి అభినందనలే వస్తున్నట్టున్నాయి! ఈ వ్యవహారాన్ని మీరు దగ్గరగా గమనిస్తున్నారా? మాతృభాష ప్రాముఖ్యాన్ని మంత్రిగారు నొక్కిచెబుతున్నారు. బాగుంది. హిందీ కూడా నేర్చుకొమ్మంటున్నారు. ఇది మాత్రం ఇబ్బందిగా వుంది. దీన్ని ఐచ్ఛికం చేస్తే బాగుండును. ఆంగ్లం ఎలాగూ అవసరమే. రాజ్యాంగం అనుతించదుగనుక దేశానికంతటికీ ఒకే విద్యాబోర్డు సాధ్యం కాదంటున్నారు - భిన్నత్వం భారతదేశానికి చాలా ముఖ్యమైనదంటూనే. భాషల వ

పులి

ఇంకో ఇరవైనిముషాల్లో... ఇంకో పది నిముషాల్లో హెలికాప్టర్ దిగిన చోటికి చేరుకుంటున్నాం అన్నారు. గంట గడిచింది. అసలు సమాచారం చెప్పడం లేదు. బహుశా భద్రతాకారణాలేమో, ఈ పాటికి హైదరాబాదు చేర్చేసి వుంటారు అనుకున్నాను. నేరుగా రాజశేఖరరెడ్డి నోటెమ్మటే, ఏమి జరిగిందో కుశాలగా వినొచ్చుననుకున్నాను. తరువాత అంతా తల్లకిందులు. వార్త వినగానే కళ్లెమ్మట నీళ్లు. అత్యంత ఆత్మీయుల మరణం కూడా నాతో ఇంత సులభంగా కన్నీళ్లు పెట్టించలేదు. నా బాధను సరిగ్గా అర్థం చేసుకోగల మనుషులతో వెంటనే మాట్లాడాలని తొందర కలగలేదు. మరిప్పుడెందుకు? నా అంచనా తప్పినందుకేనా? నా సన్నిహితుడేమీ కాడే? పత్రికల్లో సెజ్ నిర్వాసితుల కథనాలు చూసి చూసి కడుపు మండినవాణ్ణే నేను, హెలికాప్టర్ దొరికిందనగానే సంబరమెందుకు? అవినీతి, అధికార దుర్వినియోగం అనే మాటలను పత్రికలలో ప్రతిరోజూ చూస్తూనే వున్నానే, రాజశేఖరరెడ్డి మాట్లాడితే చూద్దామని అంతగా ఎదురు చూడటం ఎందుకు? ఇంక మాట్లాడడని తెలియగానే కండ్లు చెమర్చడమెందుకు? ఇరవైయ్యేళ్ల నాటి సంగతి. ఆ దినము, వీరబల్లె వీధుల్లో తలెత్తి ఎక్కడజూసినా తెల్లటి గుడ్డల మీద నీలంరంగు చేతిరాతలు. ఆ రాతల్లో నాకు బాగా గుర్తున్నవి: "స్వాగతం సుస్వ