మాలపల్లి - ముందుమాటలో ముందుమాటలు
మా ఊళ్లో భలే భలే మాటలు వినబడతావుంటాయి. మచ్చుకు ... "ఒక్క ముక్క అర్థమైతే నీ యడంకాలిమెట్టుతో కొట్టు" ఈ మాట ఎప్పుడుబడితే అప్పుడు వినబడదు. నువ్వేదైనా లొడలొడా చెప్తాండావనుకో. అవతల మనిషికి నువ్వేదో చానా ముఖ్యమైన సంగతే చెప్తాండావని అర్థమయ్యి, ఏమి చెప్తాండావో మాత్రం అర్థం కాకండా వుందనుకో. పో..ఇంచేపు వింటాడు. అప్పుడుగూడా అర్థం కాకపోతే, నువ్వు మాట్లాడ్డం ఆపి ఒక్కరవ్వ అవకాశం ఇచ్చినప్పుడు ఇదో ఈ మాట అంటాడు - పూర్తి నిజాయితీతో. ఐతే ఈ మాట ఇప్పుడెందుకు చెప్తాండానంటే, ఈరోజు నేనూ ఈమాటే అన్న్యా గాబట్టి. ఎవురితోనంటే కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుతో. సచ్చి ఏలోకానుండాడో నా మాట మాత్రం ఖచ్చితంగా యినే వుంటాడు. ఎందుకన్న్యాను అంటే ఆయన అట్టా మాట్లాణ్ణాడు మరి. ఎక్కడ? ఉన్నవ లక్ష్మీనారాయణపంతులవారి 'మాలపల్లి'కి ముందుమాట మాట్లాడతా ఆయనేమన్యాడో మీరే వినండి (పుస్తకం నుండి యథాతథం) - "శ్రీమహాభారత సాహిత్యేతిహాసములు మావవధర్మ పరిణామమునందు దివ్యపర్వములు, కర్మపరాయణమైన ప్రవృత్తి ధర్మపరమైన జ్ఞానపరిణామమును పొందుట పురుషార్థము, విశ్వసాహిత్యము, పురుషార్థ సిద్ధికి సాధనముగాగల విధమును, కావ్యకళాది రూపములను, మహాత్మ