పోస్ట్‌లు

జనవరి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

పొద్దుపోని యవ్వారం - 8

అధ్యక్షా! ... అనగానే నీకేం గుర్తుకొస్తుంది? శాసనసభలో రాజశేఖరరెడ్డి బొంగురుగొంతు. నాకూ ఆ వాచకమూ ఆకారమే మనసుకొస్తుంది నీకేనేమిటి, తెలుగువాళ్లకెవరికైనా అంతే! శాసనసభ్యులందరూ అధ్యక్షా అని ప్రశ్నలు వేస్తూవుంటారు కదా అధ్యక్షుడున్నదే తడికరాయబారానికి కదా! అంతేనా? సస్పెన్షన్లు, వాయిదాలు, వగయిరాలు కూడా చేస్తూవుంటాడనుకో. మరి, అధ్యక్షుడు ప్రశ్నలు వేయడా? వెయ్యడు. వేసినా లాభంలేదని తెలుసుగనక. ఎందుకనగా? ఎందుకేమిటి? అధ్యక్షుడు ప్రశ్నలువేస్తే అవేమౌతాయో తెలుసా? ఏమౌతాయి?! అధ్‌యక్షప్రశ్నలు. ...?! సమాధానం చెప్పే ధర్మరాజేడీ, అందునా ఆంధ్రదేశపు శాసనసభలో ???

~~ కలకాలమొకటిగా ~~

ఆ దారి ఎర్రమన్ను, కంకరలతో తయారయింది. ఇరువైపులా సర్కారుతుమ్మచెట్లు దట్టంగా పెరిగివున్నాయి. నలుగురు మిత్రులం ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. రాత్రి వర్షంపడి వెలసినట్టుంది. దారిమధ్యలో వున్న గుంతల్లో నీళ్లు నిలచివున్నాయి. పొద్దింకా పొడిచినట్టులేదు. వాతావరణం చల్లగా వుంది. ఆ దారి ఒక మలుపుతిరిగాక మాకు కొద్దిగా ముందు ఒక పన్నెండు-పదమూడేండ్ల పాప మెల్లగా నడుస్తోంది. పాత పావడా, పొడుగాటిజాకెట్టూ వేసుకుని, మొన్నెప్పుడో అల్లుకున్నజడతో మురికిగా కనిపిస్తోంది. మా నలుగురినీ గమనించినట్టే వుంది. నడుస్తూ మేము ఆ పాపకు దగ్గరగా చేరుతున్నాం. నేను పాపనే గమనిస్తున్నాను. అప్పుడా పాప తన తలమీదుగా దేన్నో వెనుకకు విసిరింది. అది గాలిలో వుండగానే నాకు తెలిసిపోయింది - గ్రెనేడ్‌. అది నేలను తాకగానే మా ముఖాలు మాడిపోతాయి, పాపతోసహా అందరి శరీరాలూ ఛిద్రమౌతాయనే ఊహ కలిగి, నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. గ్రెనేడ్ కిందపడింది. పడి దొర్లుతోంది. కూజామూతిలాంటి దాని మూతినుండి నల్లమందు, మినమినా మెరుస్తున్న లోహపురవ్వలు ఒలికి ఎర్రటి మట్టిపై పడుతున్నాయి. దానికి ఇటువైపు మేము, అటువైపు పాప. పాప ఇటు తిరిగింది. గ్రెనేడ్ మా మధ్యలో నిశ్చలంగా వుంది. బొమ...

పొద్దుపోని యవ్వారం - 7

"ఇందాకటి నుండి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు!?" "... హహ్హహ్హ హ్హహ్హ " "వినిపించేలా నవ్వమని కాదు నా ఉద్దేశం" "నాలోనేను నవ్వుకోక, నీలో నేను నవ్వుకోలేనుకదా! ... హహ్హహ్హ " "సంతోషించాంగానీ, విషయం చెప్పు" "ఇప్పుడే సుబ్బరాయునింటికెళ్లొస్తున్నానూ, ఆ మొగుడూపెళ్లాల వాదు ..." "ఎవరూ, ఆ పిసినారి ఇంటికేనా?" "సరిగ్గా ఆయన భార్యకూడా ఆయన్ను ఇదేమాట అన్నది" "ఏ మాట?" "చీర కొందామని ఏడాది తరవాత అడిగాను , ముష్టి మూడువేలు, దానికీ ఏడుస్తారు, మీరు మహాపిసినారి - అంది" "భలే! ఉన్నమాటే అంది. తరువాత?" "నేనివ్వను, అంతగా కావాలంటే నీ పరపతినుపయోగించి నువ్వే తెచ్చుకో -అన్నాడు" "ఆవిడేమంది?" "నువ్వు ప్రాణంతోవుండగా పరపతులతో నాకేం పనీ - అంది!" "....!!?" "... అలాగే ఒక మగవాణ్ణి పిసి'నారి' అని ఆక్షేపించడం కూడా తమాషాగా లేదూ?" "$#^@&"

సుషుప్తి - విముక్తి

ధృవపు ఎలుగుబంటి గురించి చదువుకున్నవిషయాల్లో నాకు గుర్తున్నది - సుదీర్ఘమైన - దాని 'సుషుప్తావస్థ'. ధృవపు ఎలుగుబంటి ఒకవిధమైన నిద్రాణావస్థలో గడపవలసివచ్చే తీవ్రమైన చలికాలం మాదిరిగా నాక్కూడా ఒకవిధమైన నిశ్శబ్దంలో గడపవలసివచ్చే కాలం ఒకటున్నట్టుంది. తీవ్రమైనచలిలో బయట తిరిగితే ఒంట్లోని కొవ్వునిలువలు త్వరగా కరిగిపోయి, ధృవాల్లో ఆ తరువాత ఆహారం దొరక్క ఎలుగుబంటికి కష్టకాలం దాపురిస్తుంది. అందుకే అది నిద్రపోతుంది. నిశ్శబ్దావస్థలో వుండవలసినప్పుడు మాటల్లో పస వుండదు, మాట్లాడితే ప్రమాదం జరిగే అవకాశమే ఎక్కువ కనుక అంతర్ముఖుడిగా వుండడమే శ్రేయస్కరం. చలికాలాన్ని తట్టుకొనేందుకు వలసిన కొవ్వును శరీరంలో నిలువచేయడానికి తగినంత తిండిని ముందుగానే కష్టపడి సంపాదించి ఆరగించి, సుషుప్తికి సిద్ధమౌతుంది ఎలుగుబంటి. నిశ్శబ్దావస్థ నుండి బయటకు రావడానికి ఆలోచనల్లో స్థిరత్వం కోసం కష్టపడవలసి వస్తుంది నాలాంటివాడికి. కాసిన్ని సూర్యకిరణాలు పరచుకొంటే చాలు నిద్రలేస్తుంది ధృవపుఎలుగు - Introvert గా కనిపించే Extrovert. ఆలోచనల్లో కాసింత ముసురుకమ్మితే చాలు నిశ్శబ్దంలోకి జారుకుంటాడు నాలాంటివాడు - Extrovert గా కనిపించే ఇంట్రొవర్తులపు గాన...