ఆ.వె
కొత్తపాళి యొకటి కోరినంతనె వచ్చి
చిత్తగించె నాదు చిన్ని కోర్కె!
ఆటవెలది మదిని ఆంతర్యమేమిటో
తేటతెల్లమాయె తెలిసికొనగ!!
ఆ.వె
నీరు తడుపలేదు నిప్పు కాల్పగలేదు
హార్టువేరు చెడును "సాఫ్టు" చెడదు!
ఆత్మ సాఫ్టువేరు అన్నాడు రానారె
ఆలమేల! అన్ని ఆశలేల!?
నాలుగు పాదాలలో యతి, గణాలు:
1 వ పాదం యతి - [నీరు - నిప్పు]
నీరు - UI
తడుప - III
లేదు - UI
నిప్పుకాల్ - UIU(ర)
పగలేదు - IIUI(సల)
3ఇన 2ఇంద్ర
2 వ పాదం యతి [హార్టు - సాఫ్టు]
హార్టు - UI
వేరు - UI
చెడును - III
"సాఫ్టు" - UI
చెడదు! - III
5ఇన
3వ పాదం యతి [ఆత్మ - అన్నాడు]
ఆత్మ - UI
సాఫ్టు - UI
వేరు - UI
అన్నాడు - UUI(త)
రానారె - UUI(త)
3ఇన 2ఇంద్ర
4వ పాదం యతి [ఆల - ఆశ]
ఆల - UI
మేల - UI
అన్ని - UI
ఆశ - UI
లేల - UI
5ఇన
స్వాతిగారికి, కొత్తపాళీ గారికి, తెవికీకి కృతజ్ఞతలతో.
7 వ్యాఖ్యలు:
కవి రానారె అయిపోయారన్నమాట.
పద్యాలు బాగున్నాయి. ఇంకేం ఎత్తిన కలం దించకండి.
--ప్రసాద్
http://blog.charasala.com
Congratulations! expecting more from you....
వహవా, సెభాష్!
షెల్లీకవనపు హల్లీసకమూ
ఫ్రెంచిగీతుల మంచిరీతులు
మోహినీ గంధర్వగానం కవీ, నీ పద్యాల్!
మరీ ఓవరైందా? ఒకే ఐతే ..
ఆటవెలదితోనె ఆశీర్వదింతు నీ
కవన రీతి మరియు కార్య దీక్ష
రాగమతిశయింప రంజైన పద్యాలు
రాయుచుండు నీవు రామనాథ
వాహ్
తాతా మనవళ్ళ పద్యాలు కడు బాగు బాగు.
రానారే మంచి పురోభివృద్ది. ఇక విజృంభించు. తాతని(గురువుని)మించిన మనవడివి(శిష్యుడివి)అవ్వాలని ఆశీర్వదిస్తూ....
అభినందనలు, ఆశీర్వాదాలు అందించిన మిత్రులకు, పెద్దలకు సవినయ వందనాలు.
వావ్ రాము,అదృష్టవంతుడివి.ద్రోణాచార్యుడులాంటి గురువు దొరికాడు. వదలక అర్జునుని వలె శిష్యరికం చేసి సాగిపో..
ఐతే
ఆటవెలది మదిని ఆంతర్యమేమిటో
తేటతెల్లమయిందన్నమాట. నాకూ కాస్త చెబుదురూ
Post a Comment
ఇక్కడ తెలుగులో వ్యాఖ్యనించడం ఎలాగో మీకు తెలియలేకపోతే, అంకెలతో వ్యాఖ్యానించవచ్చు. నచ్చింది 5/10. చాలా బాగుంది 7/10 ఇలాగ.