న్యాయవాది ఎస్. జనార్ధన్ గారికి ధన్యవాదాలతో ఈనాడు లో ఈనాటి సంతోషకరమైన వార్త: *** *** *** *** *** సమ్మెలు, రాస్తారోకోలను అనుమతించొద్దు ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు ఆదేశం పార్టీల తీరుపై ఆగ్రహం, నోటీసులు జారీ హైదరాబాద్-న్యూస్‌టుడే(ఫిబ్రవరి 12, 2007) రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలు రహదార్లపై సమ్మెలు, రాస్తారోకోలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై నిర్వహిస్తున్న సమ్మెలు, రాస్తారోకోలను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి కౌంటరు దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఇందుకు రెండువారాల గడువిచ్చింది. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సమ్మెలు, రాస్తారోకోలకు అనుమతులివ్వరాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు వివిధ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జనజీవనానికి ఇబ్బంది కల్గిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ, ప్రభుత్వానికి మద్దతుగా గానీ పార్టీలు సమ్మెలు చేయడం సరికాదని పేర్కొంది. బంద్‌లు, రాస్తారోకోలను నిషేధ