అన్ని ప్రయత్నాలూ బెడిసికొడుతున్నప్పుడు, మానవప్రయత్నం ఫలించనపుడు, మనుషులసాయం అందనపుడు, అద్భుతమేదైనా జరిగి అప్రయత్నంగా మన పనిజరిగిపోతే బాగుండుననిపించడం సహజమే. మానవ ప్రయత్నం నిజాయితీగా చేసివుంటే అది ఫలించనపుడు చివరిగా అద్భుతాన్ని ఆశించడం స్వార్థమెలా ఔతుంది? మీరన్నట్లు దేవుడు అప్పుడు గుర్తుకురావడంవల్ల తప్పుచేస్తున్నామనే భావన మనకుండకూడదు. అసలు దేవుడనేవాడుంటే నిజాయితీగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించనందుకు తప్పుచేస్తున్నాననే భావన దేవునికే కలగాలి. పూజించనందుకు, భజించనందుకు మీపై కక్షగడితే వాడసలు దేవుడేకాడు. ఒక్కమాటలో చెప్పాలంటే- కర్మణ్యేవ అధికారః తే|| దేవుని కాకాపట్టడం తప్పు. ఆ సంగతి దేవునికి తెలిసేవుంటుంది. లేకపోతే నాలాంటివాళ్లను ఇంతసుఖంగా బతకనివ్వడు. ఎందుకంటే నా పనేదో నేను చేసుకుపోవడం తప్ప ఏనాడూ దేవునికి హాయ్ హెల్లో కూడా చెప్పను. మనపని మనం వేరెవరికీ హానికలిగించకుండా చేసుకుపోవడమే మన చేతుల్లో వుంది. అదే ధార్మికజీవనం అని నాకు తెలిసినది. అనవసర నమ్మకాలు, అపోహలు, పూజలు, భజనల లాంటివాటితోకూడిన సంక్లిస్టజీవనశైలులు మనఃశాంతినిదూరంచేసి, మనసులో భయాన్ని అనుమానాల్ని నాటే అవకాశం ఎక్కువ. సరే ఒకవేళ దేవుడ...