పోస్ట్‌లు

జులై, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇటీవలి కాలంలో నాకు నచ్చిన కథ

అరగంట ముందు ఒక కథ చదివాను ఆంధ్రజ్యోతి[ఆదివారం అనుబంధం]లో. మీరు ముందు కథను చదివిరండి . కిందున్న రెండుముక్కలూ చదవాలనిపిస్తే ఆ తరువాతెప్పుడైనా చదవొచ్చు. ఒక్కసారి చదివిన వెంటనే నాకే మనిపించిందంటే: అందమైన మాండలికంలో సరళంగా సాగిన కథ. చిరకాలం గుర్తుండే కథ. స్వయంగా బతకగల నేర్పు, స్వేచ్చగా బతకాలనే ధీమా కలిగివుండటమే మనిషికి మొట్టమొదటి సంప్రదాయం కావాలి. అప్పుడే సాంగ్యాలూ, పండగలూ, పర్దాలూ మనిషికి సంతోషాన్నిస్తాయి. ఆ నేర్పూ ఆ ధీమా లేకపోతే సంప్రదాయాలే సంకెళ్లవుతాయి. ఈ కథలోని జేజికి ఆ ధీమా వుంది. ఆమె సొంతంగా బతగ్గలిగింది. అంత ధీమా ఆమె కొడుకుకు లేకపోయింది. ఇక మనవరాలికి ఎలా వస్తుంది?! తమకాళ్లమీద తాము నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగించడమే కదా తల్లిదండ్రులు పిల్లలకివ్వగలిగిన బహుమతి?! మళ్లీ చదివితే మరిన్ని పార్శాలు కనిపిస్తాయా కథలో. ఔనంటారా?

వరసబెట్టి ఒక తొంభై కథలు ...

తెలంగాణ కథలు ... వరసబెట్టి ఒక తొంభై కథలు ... నూరేండ్ల ముందటి మాడపాటిహనుమంతరావు కథతో మొదలు. పీ.వీ.నరసింహారావు అరవైయేండ్ల ముందు రాసిన కథొకటి. దొరల గడీలు, దొరసానుల గారడీలు, పటేండ్ల పరువులు, పనివాండ్ల పరుగులు, పనిమంతుల కథలు, పనికి'రాని'వాళ్ల పాట్లు, కులాల - కులవృత్తుల వృత్తాంతాలు, సాయబుల ఇండ్లల్లో సమాచారాలు, అన్నల గన్నుల కథలు, అన్నల గన్న అమ్మల కథలు, భూనిర్వాసితుల కథలు, భూస్వామ్యానికి బీటలు, రజాకార్ల నాటి రాజకీయాలు, కాలం తెచ్చే మార్పును పసిగట్టగలిగిన గట్టిపిండాల కథలు, మార్పుకు తట్టుకోలేక 'మనాది'తో మగ్గినవాళ్ల కథలు, తెలంగాణ నుడికారపు మజా ఏమిటో రుచిచూపించిన కథలు ... గడచిన నూరేండ్లలో తెలంగాణ ప్రాంతంలో జన జీవనంలో మార్పుల క్రమాన్ని కళ్లముందు నిలిపే కథలు ... ఈ కథలన్నీ చదివాక తెలంగాణ సమాజపు వందేళ్ల చారిత్రక చిత్రం సజీవంగా నా ముందు నిలబడినట్లనిపించింది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇది ఏ ఒక్కరిద్దరు చరిత్రకారులో రాసినవి కావు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, దాశరథి రంగాచార్య, చెరబండరాజు, మాదిరెడ్డి సులోచన, అప్సర్, కాలువ మల్లయ్య... ఇలా నాటి నుంచి నిన్నామొన్నటి వరకూ ఎందరో కథకులు ......

ప్రపంచపు ప్రకృతేమిటన్నది ...

మన చుట్టూ వున్న ప్రపంచపు ప్రకృతేమిటన్నది తెలుసుకొనే ప్రయత్నం ప్రతి మనిషీ నిరంతరం చేస్తుంటాడనుకుంటా. కొన్ని సందేహాలుంటాయి. కొన్ని మానసికమైన అవరోధాలుంటాయి. కొన్ని శూన్యతలుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ కొన్ని స్వీయ అనుభవాలవల్లా కొందరి మాటలవల్లా ఇవి తొలగుతూవుంటాయి లేదా మారుతూ వుంటాయి. అలాంటి ఒక అనుభవం జయప్రకాశ్ నారాయణ్ మాటలు వింటూవుంటే కలిగింది. ఆయన మాటల్లో నాకు ముఖ్యమైనవనిపించిన కొన్నింటిని వింటూ టైపించాను. వాలుఅక్షరాల(Italics)లో వున్నవి నా అభిప్రాయాలు. 1. దేశం బాగుండాలంటే మనం మహాత్మాగాంధీలం కావాలనుకుంటాం. అక్కర్లేదు. We are ordinary mortals. (దేశము బాగు లాంటి మాటలు వినగానే నా భుజాలమీద ఏదో పెద్ద బరువున్నట్లు మొహంమారకపోతే నేను చంద్రమండలంమీదో అంతరిక్షంలోనో వున్నట్టనిపిస్తుంది తప్ప భూమ్మీదున్నట్టనిపించదు) 2. ఎన్టీయార్ గొప్ప nobility ఉన్న మనిషి. ఆయనలో అవతలిమనిషిలో కాస్త మంచితనం ఉందనుకుంటే ఆదరించే వ్యక్తిత్వమున్నది, అవతలిమనిషిలో ఆత్మగౌరవముంటే దాన్ని గుర్తించే వ్యక్తిత్వమున్నది. (ఎన్టీయర్ వ్యక్తిత్వం గురించి ఈ మాటలు చెప్పినవాళ్లను నేను చూడలేదు - ఆయనతో వ్యక్తిగత పరిచయమున్నవారితో సహా) 3. ఆంగ్ సా...