పోస్ట్‌లు

మార్చి, 2009లోని పోస్ట్‌లను చూపుతోంది

సోడా కేకూ సినిమా మరియు ...

బస్టాండులో వికారం సోడా గ్యాస్ తాగడానికి చేతిలో ఐదు రూపాయలు ... బేకరీముందు సైకిలాపి హనీ కేక్ కొనుక్కోడానికి జేబులో పది రూపాయలు ... లక్ష్మీరంగాలో కొత్తసినిమా బాలేదంటలే అనుకోకపోతే టికెట్టుకు ఇరవై రూపాయలు ... సోడా తాగనోడు కేకు తిననివాడు సినిమా చూడనోడు కడపలో ఎవడూ లేడు! డిగ్రీ చదివేరోజుల్లో ఇవీ నా బృహత్తరమైన ఆలోచనలు. కడపలో బతికే ప్రతి మనిషికీ రోజూ ఓ ముప్పైఐదురూపాయలు వాటంతట అవే వచ్చి జేబులో పడితే బాగుండునని ఆనాటి నా బలమైన కోరిక. కాబట్టి ఈమధ్యే చంద్రబాబునాయుడుగారు ప్రటించిన నగదు పంపణీ పథకాన్ని మెచ్చి, నా పవిత్రమైన(!) ఓటును వేసి గెలిపించేద్దామని కాదు నా ఉద్దేశం. వయ్యస్రాశ్శేఖర్రెడ్డిగారి జనా'కర్షక' పథకాలను మెచ్చి ఓట్లేస్తే ఎంత అభివృద్ధి జరిగిందో, ఎన్నికల సంఘం నిబంధనలొచ్చినా కూడా ఆ అభివృద్ధి ఆగకుండా అలా జరుగుతూనే ఉందో చూస్తున్నాం కదా! ఇంకా కొత్తగా కొన్ని పథకాలు వినవస్తున్నాయి - వందకే వంటసరుకులనీ ఇలాగ. ఊహూఁ ఇవన్నీ లాభం లేదు. "రోజుకు జేబుకు ముప్ఫైఐదురూపాయల పథకం" రావాలి, దేశం బాగుపడాలి. అంతవరకూ మీరూ ఇలాంటి పథకాలకు మీ పవిత్రమైన(?) ఓటు వేయకండి. ప్రజలను బిచ్చగాళ్లను చేయడానికే ఇలాంటి...