కాళ్లకూరు పాలరైతుల సత్యాగ్రహం
మిత్రులారా, మన దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయాల్లో అవినీతిని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ అసహనంతో రాజకీయనాయకులను తిట్టుకోవడం, లేదా -సమాజంలో మార్పు రావాలి- అనుకోవడం వరకూ తరచుగా జరుగుతూ వుంటుంది. ఆ తరువాత పెద్దగా జరిగేదేమీ ఉండదు. దీనికి -ఇవన్నీ పట్టించుకుంటే నా జీవితం నడవాలి కదా- మొదలుకొని ఎన్నో కారణాలు చెబుతాం. నామాటకు వస్తే నాకు ఓటువేసే వయసు వచ్చి పదేళ్లయినా ఓటరుజాబితాలో ఇంతవరకూ నా పేరు నమోదు కాలేదు. అయినా నేనూ, నాబోటివాళ్లూ రాజకీయాల గురించి అసంతృప్తిని వెళ్లగక్కే హక్కు మాకున్నట్లుగా నిస్సిగ్గుగా మాట్లాడుతూనే వుంటాం. ఎందుకు? నాకు తోచిన కారణాలు ఇవీ: చిన్నప్పటి నుంచీ మార్కులు, రాంకులూ, ఆపైన ఒక ఉద్యోగమో వ్యాపారమో సేద్యమో, వ్యక్తిగతంగా మన కాళ్లపై మనం నిలబడటం తప్ప - మనం ఈ సమాజంలో పౌరులం, మనమంతా కలిసికట్టుగా వుండి కొన్ని పనులు చెయ్యగలం, ఈ పనులవల్ల మనకు కలిగే బలం ఇదీ, సమాజంలో భాగస్వాములం కావడంవల్ల మనకు కొన్ని చిన్నచిన్న బాధ్యతలుంటాయి, వాటిని నెరవేర్చడాన్ని చిన్నప్పటినుంచే అలవాటు చేసుకోవాలి అనే భావనను కలిగించిన సంఘటనలుకానీ బోధనలుకానీ మన బళ్లనూ ఇళ్లలోనూ (కావలసినంతగా) లభించకపోవడంవల్ల. అందర్న...