పోస్ట్‌లు

మే, 2008లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇదోరకం నిరసన

1. UUUII 2. III 3. UIU IIIIUI UUUI 4. UI UU UI UI UI 5. IIUIUII III IUIUUI UUUI III III 6. UII UIUI IIUIIU IUUI UIU ఏమిటీ పిచ్చిగీతలు!???? పిచ్చాపాటీ మాట్లాడుకున్నంత సరదాగా .... ముత్యాలసరాలవంటి పల్లెపదాలను అల్లగలిగేందుకూ .... కూనలమ్మపదాలవంటి రసగుళికల్లోని మూలికలేమిటో తెలుసుకునేందుకూ .... వచనకవితా వనితలకు లయాత్మకమైన సొగసరి నడకలను నేర్పే మాత్రలను సంపాదించేందుకు .... తెలుగు ఛందస్సు మూలకాలను తేలికగా తెలుసునేందుకూ .... వెతుక్కుంటూ వచ్చిన అరుదైన అవకాశానికి జవాబులు ఈ పిచ్చిగీతలు.

పొద్దుపోని యవ్వారం -3

" రామానాయుడికి తల్లిగారు లేరట కదా " "ఆయనే ముసలివాడయ్యాడు. తల్లిగారు పోయుంటారు !" " అసలుంటే కదా పోవడానికి. అందుకే ఆయనను నిర్మాత రామానాయుడంటారు " "అదెలాగా?" " నిర్ +మాత=నిర్మాత. మాత లేనివాడు గనుక నిర్మాత అయ్యాడు" " మరి... అరవింద్? " " బ్రహ్మదేవునికి నారదుడిలా రామలింగయ్యగారికి మానసపుత్రుడన్నమాట "

ముత్యాల హస్తభూషణం

సత్తువున్నది సమయమున్నది పొత్తు జేయగ పొత్తమున్నది సొత్తు నీకిది శాశ్వతమ్ముగ చెత్త జోలికి పోకు మా! ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన ధిరన ధిరనన తకిట తకధిమి తకిట తకఝణు తకిట తకధిమి తకిట తోం! ఈ నడక ను తెలుగువారికి నేర్పింది గురజాడ అప్పారావుపంతులు. కాకపోతే నేను ఆ పంతులుదగ్గర నేర్చుకోలేదు. సరళమౌ నా పలుకులోనే సరముగలదని తెలుసుకొంటిని నాకు తెలిపిన పంతులెవరో నీకు తెలుసని తెలుసునా? చాలా కాలం తరువాత ఈ మధ్య హస్తభూషణాలు ధరించడం మొదలుపెట్టాను. పదవతరగతి వరకూ అవీఇవీ అని లేదు, వీరబల్లె మండల శాఖా గ్రంథాలయంలో కనబడిన పుస్తకాలన్నీ చదివే అలవాటుండేది. బాలలమాసపత్రికలు, పురాణపండ రంగనాథ్ రచించిన బొమ్మల పంచతంత్ర భాగవత రామాయణాదులు, మహీధర నళినీమోహన్ చొప్పదంటు ప్రశ్నలు, వినువీధిలో వింతలు, ఆరుద్ర రాసిన చదరంగం పుస్తకం, ఎనిమిదోతరగతి నుంచి సపరి'వార'పత్రికలు, సరసమైన కథల పోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన కథలు, ముప్పైరూపాయలకు పాత విజ్‌డమ్ సంచికలు దండిగా కొనుక్కోవచ్చుననే ప్రకటన చూసి కొన్న పెద్ద కట్ట (చాలా ఉపయోగపడిన మరియు గుర్తుండిపోయిన ఒక వ్యాసం నాకు వీటిలో దొరికింది), ముక్కావారిపల్లెలో చదివేటప్పుడు మా ఇంగ్లీషు ఉపాధ్యాయ...