పొద్దుపోని యవ్వారం -2
" హేయ్! " " ... " " హేయ్! నిన్నే!! " " నన్నా! ఏంటా పిలుపు? అసలేమిటా సంబోధన? " " పిలవటంలో తప్పేమిటి? " " ఐదో తరగతిలో సంబోధనా ప్రథమావిభక్తి చదువుకున్నావా? " " ఓయీ, ఓరీ, ఓసీ, ఓయీ సుబ్బారావూ, ఓసీ సరళా - ఇదేగా! " " అదీ... చక్కగా ఇటువంటి విభక్తులుండగా, -హే- యేమిటి, గొడ్డునో గోదనో అదిలించినట్టు! " " ఓరి నీ విభక్తుల భక్తి తత్పరత తగలెయ్యా! " " చూశావా, ఓరీ అంటూ చక్కగా మాట్లాడావ్? తిట్టినా చిక్కటి నుడికారంలో తిట్టావ్. " " తెలుగులో అయితే తిట్టినా ఫరవాలేదా! వామ్మో!! ఈ మధ్య ఆయనకెవరికో తెలుగుచేసిందని విన్నాను. ఇక నిన్నేమనాలి!? " " ఏమైనా అనుకో, అదియునూ ఒక్క -హే- దక్క! " " వచ్చాడయ్యా యమధర్మరాజు! సరెలే గానీ, ఇంతకూ నేన్నిన్ను పిలిచిందెందుకో అడగనేలేదు నువ్వు. " " నేను తత్‌క్షణం యమధర్మరాజునైపోతే బాగుండును.... సరే, ఇప్పుడు అడిగాననుకొని చెప్పు మరి. " " మ్... ఈ మధ్య నేనొక తెలుగు వెబ్ సైట్ చూసినాను. " " ఎక్కడా? " " భలే అడిగావ్! వెబ్ సైట్ ఎక్కడుంట...