మంచి పట్టే పట్టావ్ మనవడా ...
అల్లసానిపెద్దన కృష్ణదేవరాయని శౌర్యాన్ని వర్ణించి చెప్పిన ఈ పద్యంలో తెనాలిరామకృష్ణుడు ఒక పట్టుపట్టి తాతాచార్యుని ఇబ్బంది పెట్టాడని చెబుతారు. మాధవపెద్దిసత్యం పాడిన ఈ పద్యాన్ని నేను పాడటం దుస్సాహసం-2. మంచి పట్టే పట్టావ్ మనవడా ... అని పెద్దమనసుతో మెచ్చుకొని, ఏదీ నువ్వొక పద్యంచెప్పు అనగానే అతిశయాలంకారంలో ఆ మనవడు చెప్పిన ఈ పద్యం వినండి. ఈ పద్యంలోని పదాల్ని విడగొట్టి బ్రౌణ్యములో అర్థాలు వెదికి కొంతమేర అర్థంచేసుకొని "ఓహో" అనుకొని సంబరపడ్డాము మాయింట్లో. ఎందుకింత ప్రయాస అంటే ఘంటసాల పాడిన పద్ధతి అంత ఆసక్తికరంగా గొప్పగా వుంది మరి. మీరూ వినండి ఇక్కడ. కలనన్ - యుద్ధంలో తావక - నీయొక్క ఖడ్గఖండితుడైన రిపు - శత్రు క్ష్మా భర్త - భూ పాలకుడు మార్తండమండల భేదంబొనరించి ఏగునపుడు తత్ మధ్యంబునన్ - ఆ మార్గ మధ్యంలో తార కుండల కేయూర కిరీట భూషితుడైన శ్రీమన్నారాయణుని చూచి లో గలగం బారుచు నేగె - భయపడి వడిగా పారిపోయెను (ఎందుకు అంటే...) నీవ యను శంకన్ - అది నీవేనేమో అనే భయంతో నయ్యా కృష్ణరాయాధిపా!! (అధిపుడు - రాజు) ఈ పద్యం యొక్క అర్థాన్ని చెప్పడంలో నేను పొరబాట్లు చేసివుంటే విజ్ఞులు నాకు మొట్టికాయలు వేయవలసిందిగా మన...