యథా ప్రజా తథా రాజా!
మొన్నటినుంచి వార్తలు చూసి చూసి మెదడు అలసిపోయింది. బాంబుపేలుళ్లు, కాల్పులూ చిన్నప్పటినుంచి వింటూనే వున్నాను చూస్తూనే వున్నాను. కాకపోతే ఈసారి చాలా తేడా కనిపిస్తోంది. నాకేమనిపిస్తోందంటే ... బారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కిచిడీ పార్టీ ఎవరు అధికారంలో వున్నా ... దేశప్రజల్లో అశేషంగా వున్న అజ్ఞానాన్ని పొదిగి వృద్ధిచేసేవాళ్లే. నగరాల్లో ఏరియాలను పంచుకొని దందా సాగించే మాఫియాలకూ, పరిపాలనా కాలాన్ని పంచుకొని దందా సాగిస్తున్న పార్టీలకూ తేడా ఏమీ లేదు. ఈ రెండు పరిస్థితుల్లోనూ సామాన్యునికి అభద్రతే. మొన్నీమధ్యే ముంబయ్ రైలుపేలుళ్ల బీభత్సం జరిగిన వెంటనే నిముషాల్లో యథాతథ పరిస్థితి నెలకొంది, స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అన్నారు. సంతోషమే. స్పిరిట్ సరే, మంచిదే, వుండాల్సిందే. ఇష్టారాజ్యంగా బాంబులు ఎట్లా తయారౌతున్నాయి, ఎక్కడబడితే అక్కడికి ఎలా చేరుతున్నాయి, పేలుతున్నాయి అనే మాటకంటే స్పిరిట్ ఆఫ్ ముంబయ్ అనే మాటే ఎక్కువగా వినిపించింది. కారణం మనకు బాంబు పేలుళ్లు కొత్తకాదు. తాజాగా జరిపిన దాడితో ఉగ్రవాదులు 'కొంచెం కొత్తగా ఆలోచించండ్రా' అనే సందేశాన్ని మన జనానికి చేరవేయడంలో మొదటి అడుగు వేసినట్టున్నారు. ఎప్పటిలాగే &