పొద్దుపోని యవ్వారం - 9

దాశరథీ శతకం తెలుసా?
శతకమొకటి వుందని తెలుసు

ఎవర్రాశారో తెలుసా?
కంచెర్ల గోపన్న

పద్యాలేమైనా వచ్చునా?
శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ అనే పద్యం వచ్చు

ఇంకా?
భండన భీముడా ర్తజనబాంధవు డుజ్వల బాణ తూ...

ఆగక్కడ. గోపన్న కాళిందిలో కాలేశాడు
!!!??

ఏమిటలా మిడిగుడ్లేసుకుని నన్ను చూస్తావు? ఆ పద్యాన్ని చూడు
పద్యానికేఁ?!

ఆ పద్యం ఎవరిగురించి?
రామమూర్తిని గురించి

కదా! రాముడు ముందా? భీముడు ముందా?
త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కృష్ణునితోపాటే భీముడు

ఎవరు ముందు?
రాముడే. అయితే?

అయితే గోపన్న ఏమన్నాడు? భండన భీముడు అన్నాడు. ఎవరిని? రాముణ్ణి!
అంటే తప్పేముంది?

తప్పా తప్పున్నరా?!! భీముణ్ణి రామునితో పోల్చితే... అందం, చందం, తల్లీ-బిడ్డా న్యాయం. నలుగురూ ఒప్పుకుంటారు. రామదాసు చేసిందేమిటి? ఎప్పుడో రామాయణంనాటి రాముణ్ణి మొన్నటి మహాభారతం భీమునితో పోల్చి, అవమానం చేసినాడుకదా! ఇదేమని అడిగినవాడు ఒక్కడూ లేకపోయినాడే!!
నువ్వు బయల్దేరినావు కదా?

అంటే, నీకిది తప్పుగా తోచలేదా?
చూడు చిట్టితండ్రీ! భండనము అంటే యుద్ధమని తెలుసుకున్నావు, బాగుంది. భీముడంటే భారతంలో భీముడు కాదు నాయనా. భీ అనే సంస్కృతశబ్దానికి భయమనే అర్థముంది. భీమము అన్నాకూడా భయమే. అలాంటిలాంటి భయంకాదు వణుకుపుట్టించే భయం. భీముడు అంటే అంతగా భయపెట్టగలిగేవాడు అని. భండనభీముడు అంటే, తన పరాక్రమంతో యుద్ధంరంగంలో శత్రువులకు రాముడు అంత భీతిగొలిపేవాడు అని.

మ్...!!??
మ్.

కామెంట్‌లు

బాగుంది రానారె... తప్పు తప్పుగా తోచలేదా అని అడిగిన పద్ధతి బాగున్నది..:) గుడ్డో గుడ్డు.

గండర గండడు బ్లాగుజనబాంధవుడు....అలా ఆ పైదాకా వెళ్ళలి అని దంతాలు రక్తవర్ణం చేస్తూ ...:)...:)
oremuna చెప్పారు…
మరో విషయం ఏమిటంటే,
మనకు ఈ భీముళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు.
వేదాల్లో కూడా ఓ భీముడు ఉన్నట్టు గుర్తు.
రవి చెప్పారు…
భీమ పరాక్రమం అని ఎక్కడో చూసిన గుర్తు.

ఈ పద్యం చిన్నప్పుడు వీధి నాటకాల్లో రాయబారం పద్యాలంతగా ఫేమస్. నటుడు ఓ చుక్క మందేసుకును స్టేజి పైన, రాగాలు తీస్తూ, ఈ పద్యం పాడుతుంటే, ఎక్కడికో.. వెళ్ళి పోయినట్టు ఉండేది.
అజ్ఞాత చెప్పారు…
రానారె.. భళారే..
రానారె చెప్పారు…
టాంక్స్ టాంక్స్ టాంక్స్ టాంక్స్ టాంక్స్ :-)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము