పొద్దుపోని యవ్వారం - 7

"ఇందాకటి నుండి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు!?"
"... హహ్హహ్హహ్హహ్హ"

"వినిపించేలా నవ్వమని కాదు నా ఉద్దేశం"
"నాలోనేను నవ్వుకోక, నీలో నేను నవ్వుకోలేనుకదా! ...హహ్హహ్హ"

"సంతోషించాంగానీ, విషయం చెప్పు"
"ఇప్పుడే సుబ్బరాయునింటికెళ్లొస్తున్నానూ, ఆ మొగుడూపెళ్లాల వాదు ..."

"ఎవరూ, ఆ పిసినారి ఇంటికేనా?"
"సరిగ్గా ఆయన భార్యకూడా ఆయన్ను ఇదేమాట అన్నది"

"ఏ మాట?"
"చీర కొందామని ఏడాది తరవాత అడిగాను, ముష్టి మూడువేలు, దానికీ ఏడుస్తారు, మీరు మహాపిసినారి - అంది"

"భలే! ఉన్నమాటే అంది. తరువాత?"
"నేనివ్వను, అంతగా కావాలంటే నీ పరపతినుపయోగించి నువ్వే తెచ్చుకో -అన్నాడు"

"ఆవిడేమంది?"
"నువ్వు ప్రాణంతోవుండగా పరపతులతో నాకేం పనీ - అంది!"

"....!!?"
"... అలాగే ఒక మగవాణ్ణి పిసి'నారి' అని ఆక్షేపించడం కూడా తమాషాగా లేదూ?"

"$#^@&"

కామెంట్‌లు

teresa చెప్పారు…
:)
కుంచెం బారయింది. చివరి 2 డైలాగులు కత్తిరిస్తే కూడా బాగా పేలేది్.
రానారె చెప్పారు…
తెరెసాగారు, బాగాచెప్పారు. కృతజ్ఞతలు. ఈ టపాను కట్టేశాక, మళ్లీ ఇప్పుడు చదివాను. అప్పడంలాంటి విషయాన్ని మిరియాలచారులో ముంచి తిన్నట్టుగా అనిపించింది. కొన్ని మాటలను కత్తిరించాను. మిరియాలచారుకూడా బానేవుందన్న ఫణీంద్ర, కోత్తపాళీగార్లకు నెనరులు.

ఒక మాటను తమాషాగా చెప్పాలనుకోవడం ఆరోగ్యచిహ్నమైతే, ఆ జోకును అప్పడంలా అందించగలగడం మానసికారోగ్యానికి సూచిక అనుకోవచ్చునేమో. :-)
ఆత్రేయ కొండూరు చెప్పారు…
అయ్యో రావడం లేటయ్యేసరికి మిరియాల చారు లాగించేశారన్న మాట
నంజుకేమీ లేకపోయినా అప్పడం అదుర్సు. ఫెళఫెళలాడింది.
కామేశ్వరరావు చెప్పారు…
మీరు అప్పడంలా అందిద్దామనుకున్నది జోకో, గడికి స్లిప్పో మా కర్థమయ్యింది లెండి :-)
రానారె చెప్పారు…
ఆత్రేయ, రాధికగార్లకు - నెనర్లు.
భైరవభట్లగారూ, అసలు సంగతి పట్టేశారు. చీటీలివ్వాలని కాదుగానీ, గడిని కూర్చేటప్పుడే 'పిరినారి, పరపతి' కనిపించారు, ఒకరిని అక్కడ, ఒకరిని ఇక్కడ హాజరుపరిచాను. :)
రాఘవ చెప్పారు…
గడి చూడకపోయినా ఈ చమత్కారాన్ని ఆస్వాదించచ్చు. బావుంది :)

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

విజయా వారి విజయపతాక

ఉత్పలమాల - గురువు - లఘవు

లఘు కవితలు - సర్వలఘు కందము